వైఎస్ జగన్‌పై నాగబాబు కథాకళి.!

2024 ఎన్నికల ముందర రాజకీయాలు వేడెక్కడం మామూలే.! అధికార వైసీపీ నుంచి విపక్షాలపై విసుర్లు, అలాగే విపక్షాల నుంచి అధికార పక్షం మీద సెటైర్లు.. వెరసి, రాజకీయ వాతావరణం అనూహ్యంగా వేడెక్కుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు’ అంటూ వైసీపీ విరుచుకుపడుతున్నవేళ, ‘పాపం పసివాడు’ అంటూ జనసేన పార్టీ కౌంటర్ ఎటాక్ షురూ చేసింది. అక్కడితో ఆగలేదు, ‘కథాకళి’ అంటూ కొత్త కార్యక్రమాన్ని అనౌన్స్ చేసింది. పార్ట్ వన్ కూడా విడుదల చేసింది.

ఓ వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు నాగబాబు.. చెలరేగిపోతున్నారు. దానికి అధికార వైసీపీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ గట్టిగానే పడుస్తోంది. ‘కథాకళి’ విషయానికొస్తే, ‘నేను పేదవాడ్ని’ అని వైఎస్ జగన్ చెప్పడంపై, నాగబాబు తన ట్రేడ్ మార్కు సెటైర్లు వేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

మీడియా లేదు, వాళ్ళలా డబ్బుల్లేవు.. అని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో అసందర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అది స్క్రిప్టు లోపం వల్ల జరిగిన తప్పిదం. నిజానికి వైఎస్ జగన్ అలా అని వుండకూడదు.!

సరిగ్గా ఆ పాయింట్ దగ్గర దొరికేసిన వైఎస్ జగన్ మీద, జనసేన పార్టీ సెటైర్ల వర్షం కురిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో, టీడీపీ నిజానికి తెరమరుగైపోవాలి. కానీ, టీడీపీకి వైసీపీనే ఎలివేషన్లు ఇస్తోంది, ‘దత్త పుత్రుడికి యజమాని చంద్రబాబు’ అని చెబుతూ.!