తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. దేశంలోనే ఖరీదైన ఉపఎన్నిక కావడంతో ఈ ఉపఎన్నిక గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే బీజేపీ ఏపీపై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది.
ఏపీలో విజయం సాధించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీ జనసేన కూటమి పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మునుగోడులో బీజేపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఏపీపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు. మునుగోడులో ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫిక్స్ అయింది.
ఎంత డబ్బు ఖర్చు చేసినా పెద్దగా ఫలితం అయితే ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల మనస్సులో ఏముందో ఎవరూ ఊహించలేరు. అన్ని పార్టీలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండటంతో ఈ ఎన్నికల్లో ఓట్లు చీలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీని ఓడించడం కష్టం కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మునుగోడు 500 కోట్ల రుపాయల నుంచి 600 కోట్ల రూపాయల రేంజ్ లో అన్ని పార్టీలకు ఖర్చు అవుతోందని సమాచారం అందుతోంది.