వైసీపీలోకి ముద్రగడ.! ఏమన్నా లాభముందా.?

ముద్రగడ పద్మనాభం.. పరిచయం అక్కర్లేని పేరిది.! కాపు ఉద్యమ నేతగా పాపులర్ అయిన మాజీ మంత్రి ఈయన.! చంద్రబాబు హయాంలో నానా హంగామా చేశారు ముద్రగడ.! ఈయన వల్లనే తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం జరిగిందనే ఆరోపణలు గతంలో వచ్చాయ్.

రైలు అయితే తగలబడింది.! ఎవరు తగలబెట్టారన్నది తేల్చలేకపోయారు ఇప్పటిదాకా. ఆనాటి ఆ ఘటనకు సంబంధించి చాలామంది మీద కేసులు ఎత్తేశారు కూడా.! ఇంతకీ, కాపు ఉద్యమం విజయ తీరాలకు చేరిందా.? లేదా.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.

వైసీపీ అధికారంలోకి రాగానే, ముద్రగడకు ఏదో ఒక పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆయన మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. అయితే, త్వరలో ఆయన వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారమైతే జరుగుతోంది.

వైసీపీలోకి ముద్రగడ వస్తే, అదనంగా వైసీపీకి ఒరిగేదేంటి.? కాపు సామాజిక వర్గం తమతోనే వుందని వైసీపీ చెబుతోంది. వైనాట్ 175 అని కూడా ధీమాగా చెబుతోందాయె.! అలాంటప్పుడు ముద్రగడతో అవసరమేముంది.?

‘ఆఖరికి బహిరంగ లేఖల్ని కూడా అమ్ముకుంటాడాయన..’ అనే స్థాయికి ముద్రగడ పద్మనాభం ఇమేజ్ పడిపోయింది. ఒకప్పటి ముద్రగడ పద్మనాభం వేరు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వేరు. ‘కాపు’ ట్యాగ్ తప్ప.. ఆయన ఉనికి లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.

కేవలం జనసేనకు కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు ముద్రగను వైసీపీలోకి తీసుకొస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?