రాజకీయాల్లో రామ్మోహన్ రాజకీయం డిఫరెంట్, జగన్ కూడా కంగారుపడేలా

MP Ram Mohan Naidu doing good jon for TDP
గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందింది ముగ్గురే ముగ్గురు ఎంపీలు.  వారిలో యువకుడు కింజారపురామ్మోహన్ నాయుడు.  ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు సీనియర్లకు మించి పోరాటం చేస్తున్నారు.  యువకుడు కావడం, అన్ని విషయాల మీద పట్టు ఉండటంతో చంద్రబాబు కూడ ఆయనకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు.  ఆ ప్రోత్సాహంతో  రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నారు.  జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో వైసీపీ మీద యుద్ధం చేస్తున్నారు.  శ్రీకాకుళంలో మంచి కేడర్ కలిగి ఉండటం ఆయనకు బాగా కలిసొచ్చింది.  
 
MP Ram Mohan Naidu doing good jon for TDP
MP Ram Mohan Naidu doing good jon for TDP
ప్రభుత్వం తలపెడుతున్న పనుల్లో తప్పుల్ని ఎత్తి చూపుతూ అధికార పార్టీ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.  ఇలా రామ్మోహన్ నాయుడు నానాటికి బలపడుతుండటంతో ఆయనకు పోటీగా జిల్లా నుండి కొత్త మంత్రిని తయారుచేసింది అధికార పార్టీ.  తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి  అప్పలరాజును మంత్రివర్గ  మార్పుల్లో భాగంగా మంత్రిని చేశారు.   అప్పలరాజు సైతం యువకుడుకావడం, మంచి విద్యావంతుడు అవడం మూలాన టీడీపీకి   గట్టిగానే ఎదురువెళుతున్నారు.  అధినేత అప్పగించిన పనిని విజయవంతం చేయాలని కష్టపడుతున్నారు.  అయితే రామ్మోహన్ నాయుడు వెనకు తగ్గట్లేదు. 
 
తన లక్ష్యాల్లో సీదిరిని కూడ చేర్చుకుని ఇంకాస్త దూకుడుగా తయారయ్యారు.  మంత్రి ఒకటి అంటే ఎంపీ రెండు అంటున్నారు.  దీంతో రాజకీయ యుద్ధం ఈ ఇద్దరి మధ్యనే నడుస్తోంది.  ఈమధ్య దివంగత గౌతు లచ్చన్న విగ్రహం విషయంలో జరిగిన వివాదంలో వైసీపీని ఏకిపారేశారు రామ్మోహన్ నాయుడు.  మంత్రి సీదిరి అప్పలరాజు మీద విరుచుకుపడ్డారు.  ఆయన వ్యాఖ్యలను ఖండించారు.  రామ్మోహన్ నాయుడు దాడికి ప్రతి దాడి చేయడంలో వైసీపీ కాస్త తడబడింది.  ఇక తాజాగా అధికార పార్టీ మీద అనుచిత కామెంట్లు చేశాడనే కారణంతో టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీస్లు ఆర్ట్స్ చేశారు. 
 
ఈ సంగతి తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు నేరుగా పలాస పోలీస్ స్టేషనుకు వెళ్లారు.  పండగని చూసుకోకుండా పోలీస్ స్టేషన్లో  భైఠాయించారు.  తప్పుడు కేసులు మోపుతున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని,  వీటన్నింటిని మించి రాజకీయ ప్రత్యర్థులను రాత్రికి రాత్రే మాయం చేయడంలో జగన్ సర్కారు ఆరితేరిందని, ఒక్క అవకాశం ఒక్క ఆవకాశం అని అడిగి మమ్మల్ని ఈ స్థితికి దిగజారుస్తారా అంటూ పెద్ద రంగమే చేశారు.  మొత్తానికి ఎంపీ అవసరం అనిపిస్తే రోడ్ల మీదకు రావడానికి కూడ జంకేది లేదని స్పష్టం చేసేశారు.