గవర్నర్ తో టిఆర్ఎస్ ఎంపి కవిత భేటీ

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సోమవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. నవంబర్ లో హైదరాబాదులో జరగనున్న భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంపోరి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని ఎంపీ కవిత కోరారు. మన రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ తోపాటు దక్షిణాది రాష్ట్రాల స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కవిత గవర్నర్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటిసారి రాష్ట్ర స్థాయి క్యాంపోరీ జరుగుతున్నది.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎంపి కవిత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్షులు ఆయిన గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలను వివరించారు.  హరితహారం కార్యక్రమం లో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటున్నారని ఎంపి కవిత తెలిపారు.