Revanth Reddy: సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పార్టీకి చెందిన ప్రధానమంత్రిని కలిస్తే ఎలాంటి సందేహాలు ఉండవు ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల పరంగా ప్రధాని కలిసి ఉంటారని అందరూ భావిస్తారు కానీ రాష్ట్రంలో ఒక పార్టీ కేంద్రంలో మరొక పార్టీ ఉండి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిస్తే కనుక వీరి భేటీ వెనుక ఏదో ఆంతర్యం ఉందనే సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడం వెనుక కూడా ఇలాంటి సందేహాల వ్యక్తం అవుతున్నాయి. బిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలో ఒకటేనంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా విమర్శలు చేశారు అయితే గత కొంతకాలంగా బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తో పాటు బిఆర్ఎస్ స్నేహితులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. మరో ఆరు నెలలలో రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతుంది అంటూ బండి సంజయ్ మాట్లాడారు.
ఇలా ఒక కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఆసామాసి విషయం కాదు ఈ వ్యాఖ్యల వెనుక ఎంతో ఆంతర్యం ఉందని తెలుస్తోంది .అలాగే పలువురు బి ఆర్ స్ నాయకులు కూడా ఇదే పాట పాడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పార్టీని కాపాడుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా బిజెపి హవా కొనసాగుతోంది ఇటీవల ఢిల్లీలో కూడా బిజెపి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో లేదు ఇలాంటి తరుణంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి అంటే మోడీ దగ్గర మంచిగా ఉండటమే ముఖ్యమని భావించిన రేవంత్ రెడ్డి ఆయనని కలిసారని తెలుస్తుంది.
ఇక రాష్ట్ర సంక్షేమం కోసమే ప్రధానమంత్రిని కలిసి ఉంటే కనుక ఆయనతో పాటు మరో మంత్రి అలాగే సీఎస్ లు కూడా రేవంత్ రెడ్డి వెంట వెళ్లారు. కానీ వారు ఎవరు ప్రధానితో కలవకుండా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే పర్సనల్ గా ప్రధానిని భేటీ కావడంతో ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏంటనే చర్చలు మొదలయ్యాయి.