Chiranjeevi: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. అంతేకాకుండా సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. చిరు చివరగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. సడెన్ గా చిరంజీవి సీఎం రేవంత్ ని కలవడంతో ఈ మీటింగ్ టాలీవుడ్ గురించా లేక మర్యాదపూర్వకంగా కలిసారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అని చర్చలు జరుగుతున్నాయి.
https://twitter.com/mallitimes/status/1952023179662418211?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1952023179662418211%7Ctwgr%5Ee37912bd4a35907ed9557db89b971059d7fba177%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fmegastar-chiranjeevi-meets-cm-revanth-reddy-video-goes-viral-sy-975338.html
అయితే వీరి మీటింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చిరంజీవి సీఎం రేవంత్ ని కలిసిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇక చిరంజీవి అనిల్ రావిపూడి షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విశ్వంభర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టాలని మూవీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
