Bandla Ganesh: ఏపీ సీఎంతో బండ్ల గణేష్ ఆత్మీయ ఆలింగనం… అసలు మ్యాటర్ అదేనా?

Bandla Ganesh: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న బండ్ల గణేష్ నిర్మాతగా మారారు. ఈయన నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను కూడా నిర్మించి సక్సెస్ అందుకున్నారు కానీ గత కొంతకాలంగా సినిమాలకు బండ్ల గణేష్ పూర్తిగా దూరంగా ఉన్నారు.

ఈయన గతంలో రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్ గా కనిపించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన బండ్ల గణేష్ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కూడా కాంగ్రెస్ విజయం గురించి పోస్టులు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయాల గురించి కూడా ఈయన స్పందిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసారు తాజాగా వీరిద్దరూ ఆత్మీయ ఆ లింగనం చేసుకున్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఎంతో కృతజ్ఞత భావంతో కనిపించినట్లు తెలుస్తోంది. ఇలా చంద్రబాబు నాయుడుని కలవడానికి కారణం ఉందని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ ఆయన గురించి సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.తాను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు ఓ వ్యక్తి తనని ఆదుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో నా భార్య చంద్రబాబు గారిని కలవమని సలహా ఇచ్చింది. వెంటనే తెలిసిన వారి నుంచి బాబు గారి అపాయింట్మెంట్ తీసుకొని తనని కలిసాను ఆయనను కలిసిన రెండు రోజులలోనే నా సమస్యకు పరిష్కారం దొరికిందని తెలిపారు.

నా సమస్య విన్న వెంటనే ఆయన నన్ను సంబంధిత అధికారి దగ్గరకు పంపించారు. నమ్మండి నమ్మకపోండి, ఏడేళ్లుగా నాకు అంతుచిక్కని, సమస్య కేవలం నిమిషాల్లోనే సమసిపోయింది. ఆ పని కూడా రెండు రోజులలోనే పూర్తి అయ్యింది అంటూ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా బాబు గొప్పతనం గురించి బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. అయితే ఈ సమస్య తీరడంతోనే బాబు గారికి కృతజ్ఞతలు తెలపడానికే మరోసారి ఆయనని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.