బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు.. మోక్షజ్ఞలో ఇంత ఫైర్ ఉందా?

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఏ హీరో కొడుకు గురించి రాని స్థాయిలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి స్పందించడానికి నందమూరి కుటుంబం ఇష్టపడటం లేదు. మోక్షజ్ఞ సినిమాల్లోకి రాకపోవచ్చని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అయితే మీడియా ముందుకు రావడానికి కూడా పెద్దగా ఇష్టపడని మోక్షజ్ఞ తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. మోక్షజ్ఞ ఆ ట్వీట్ లో “బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్నా కొన్ని కుక్కలకు.. మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు.. అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినవారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెప్తుంది” అని పేర్కొన్నారు.

మోక్షజ్ఞ చేసిన ట్వీట్ ను చూసి మోక్షజ్ఞలో ఇంత ఫైర్ ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని అందుకే ఈ రేంజ్ లో ట్వీట్ చేశారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మోక్షజ్ఞ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మోక్షజ్ఞ సినిమాల్లోకి కాకుండా రాజకీయాల్లోకి వస్తారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మోక్షజ్ఞ చేసిన ట్వీట్ విషయంలో నందమూరి అభిమానులు మాత్రం సంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. తొలి ట్వీట్ ఇంత ఘాటుగా చేసిన మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో ఇంకెంత ఘాటుగా స్పందిస్తారో అని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.