మోహన్ బాబు లెక్కలు తప్పాడు, టిడిపి ఫైర్

ఫీ రియింబర్స్ మెంటు భారీ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని సినీనటుడు, శ్రీ విద్యానికేతన సంస్థల ఛెయిర్మన్ మోహన్ బాబు చెబుతున్న లెక్కలు తప్పని  ప్రభుత్వం  ప్రకటించింది.

తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మోహన్ బాబు విద్యా సంస్ధలకు విడుదల చేసిన ఫీజు రీ-ఇంబర్స్మెంట్ లెక్కలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాదారు కుటుంబరావు  మీడియాకు విడుదల చేశారు.

కుటుంబరావు

తన విద్యాసంస్థలకు బకాయీలు చెల్లించాలని విద్యార్థులతో కలిపి మోహన్ బాబు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఈ వివాదం మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇవిగో వివరాలు:

మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్ధలకు ఇప్పటి వరకు రూ. 95 కోట్లు కేటాయించాం.

రూ. 95 కోట్లల్లో ఇప్పటికే రూ. 88.57 కోట్లు రిలీజ్ చేశాం.. రూ. 6.43 కోట్లు పెండింగులో ఉన్నాయి.

2014-15 రూ. 7051, 2015-16 రూ. 2,69,000, 2016-17 రూ. 64 వేలు, 2017-18 రూ. 1.86 కోట్లు, 2018-19 రూ. 4.53 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి.

వాస్తవాలు ఈ విధంగా ఉంటే మోహన్ బాబుకు ఎందుకు ఆదుర్దా..?

ముందుగా ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ చేయాలని ఎలా అంటారు..?

మోహన్ బాబు వ్యాపారం చేస్తున్నారా..? విద్యా సంస్ధను నడుపుతున్నారా..?

తన విద్యా సంస్ధల్లోని ప్రతి ఒక్కరికి ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ తీసుకుంటూ 25 శాతం మంది విద్యార్ధులకు ఉచితంగా విద్యనందిస్తున్నానని ఎలా చెబుతారు..?

ప్రతిపక్షానికి వంత పాడడానికే మోహన్ బాబు ఆరాటం.

ప్రజలను ప్రతిపక్ష నాయకుడు మభ్య పెడుతున్నారు.గాలి మాటలు మాట్లాడుతున్నారు.

జగనుకు మోహన్ బాబు వంత పాడుతున్నారు.

2014-2019 రూ. 14, 510.కోట్లు ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లింపులు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఖర్చు పెట్టలేదు.

రాష్ట్రంలో ఏ కాలేజీకి డబ్బులివ్వనట్టు మోహన్ బాబు మాట్లాడుతున్నారు.

మోహన్ బాబు ఆరోపణలపై చర్చకు సిద్దం.

2014 నుంచి ఒక్క పైసా రాలేదని ఎలా చెబుతారు..?

మోహన్ బాబుకు విద్యా దాన కర్ణుడిననే పేరు కావాలి.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని మోహన్ బాబు విద్యా దాన కర్ణుడిలా ఫోజు కొడుతున్నారు.

సొసైటీలో పెద్ద మనిషిలా ఉన్న మోహన్ బాబు నాన్సెన్స్ మాట్లాడ్డం సరికాదు.

మోహన్ బాబుపై చాలా గౌరవం ఉండేది.. ఇప్పుడు లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నాం.

పొలిటికల్ మోటీవ్ కన్పిస్తోంది.

ఓ పార్టీ తరపున తాను కానీ.. తన కుమార్తె కానీ పోటీ చేస్తారని గతంలోనే చెప్పారు.. ఇప్పుడు ఆయన ఏ పార్టీ సానుభూతి పరుడో అర్ధమవుతోంది.