సీనీనటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్

తిరుపతి లో సినీనటుడు, శ్రీ విద్యా నికేతన సంస్థల అధిపతి మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం ఆయన ఇంటిని చుట్టి ముట్టి పోలీసులు మోహన్ బాబు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు స్కాలర్‌షిప్ బకాయిల వ్యవహారం గురించిన వివాదం చెలరేగడంతో పోలీసులు ఈచర్యకు పాల్పడ్డారు. స్కాలర్ షిప్ ల బకాయి గురించి చంద్రబాబు ప్రభుత్వం పై మోహన్ బాబు బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విద్యానికేతన్ సంస్థలకు మోహన్‌బాబు చైర్మన్.

ఈ బకాయీలుచెల్లించాలని ఇప్పుడు మోహన్ బాబు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు.
తన సంస్థ లోని విద్యార్థులతో కలిసి స్కాలర్‌షిప్ సమస్యలపై నేడు ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను తెలుయ చేయాలని నిర్ణయించారు.

ఎన్నికల కోడ్ ఉన్నందున ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వలేమని చెబుతూ పోలీసులు ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను గృహ నిర్భంధంలో ఉంచారు.

తనను హౌస్ అరెస్ట్ చేయడంపై స్పందించిన మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసగిస్తానని ఆయన ప్రకటించారు.

అసలు సమస్య ఇది

శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయీ ఉంది. ఈ బకాయి చెల్లించాలని సంస్థ అధినేత మోహన్‌ బాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే, డబ్బులు విడుదల కావడంలేదని ఆయన ఆరోపించారు చాలా సార్లుబకాయీల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 10వేల మంది విద్యార్థులతో కళాశాల నుంచి తిరుపతి వరకు నిరసన ర్యాలీచేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.