మనలో చాలామంది వయస్సు పెరిగిన తర్వాత ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా డబ్బులు పొందాలని అనుకుంటారు. ప్రస్తుతం తక్కువ మొత్తం పొదుపు చేయడం ద్వారా వృద్ధాప్యంలో సులువుగా ఊహించని మొత్తాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 2015 సంవత్సరం నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులు కూడా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. బ్యాంకు పొదుపు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరాలంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించి ఫారమ్ ను పూర్తి చేయాలి. ఫారంలో అన్ని వివరాలను పొందుపరిచాలి. వయస్సు ఆధారంగా చెల్లించే మొత్తం మారుతుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు బ్యాంక్ అకౌంట్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. కేవైసీ నిబంధనలను పూర్తి చేసి బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా ఈ స్కీమ్ కు డబ్బు వెళ్లేలా నిబంధనలు ఉండాలి. గడుపు ముగిసేలోపు చెల్లించాల్సిన మొత్తాన్ని కచ్చితంగా చెల్లించాలి. లేదంటే ఖాతాను మూసివేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఖాతాదారుడు పాలసీ తీసుకునే సమయంలో నామినీ పేరును కచ్చితంగా పేర్కొనాలి. పాలసీదారు మరణిస్తే పాలసీదారుడి భర్త లేదా భార్య స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇద్దరూ మరణిస్తే మాత్రం నామినీ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా 8,50,000 రూపాయల వరకు పొందే ఛాన్స్ ఉంది. తక్కువ వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే ఎక్కువ బెనిఫిట్ ను పొందవచ్చు.