ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరే రాష్ట్రం అమలు చేయని స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వైసీపీ సర్కార్ చెప్పుకున్నా కేంద్రం వెల్లడించిన విషయాల గురించి తెలిస్తే వైసీపీ అభిమానులు సైతం సీఎం జగన్ ను వ్యతిరేకించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
ఏపీలో ప్రస్తుతం 70 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు జరగాల్సి ఉండగా ఏపీ నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రాకపోవడం వల్ల కేంద్రం ఈ పనులను నిలిపివేసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీకి రైల్వే ప్రాజెక్ట్ లు ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న రైల్వే ప్రాజెక్ట్ లకు ఏపీ నుంచి కేంద్రానికి 1798 కోట్ల రూపాయలు అందాల్సి ఉండగా అక్కడ జరుగుతున్న పనుల విలువ 70,000 కోట్ల రూపాయలు అని సమాచారం.
వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన ఈ సమాధానం విని వైసీపీ అభిమానులు షాకవుతున్నారు. 1800 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోవడం వల్ల 70,000 కోట్ల రూపాయల పనులు ఆగిపోతున్నాయంటే వైసీపీ చాలా పెద్ద తప్పు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ కేంద్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఇవ్వాల్సిన నిధుల విషయంలో అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రమే రైల్వే ప్రాజెక్ట్ లు త్వరితగతిన పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉంది.
70,000 కోట్ల రూపాయల విలువైన పనుల విషయంలో వైసీపీ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే ఆ ప్రభావం ఏపీ అభివృద్ధిపై, ఏపీ ప్రజలపై కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతే మోదీ సర్కార్ వైసీపీ సర్కార్ పరువు తీసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్రం కామెంట్లపై వైసీపీ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.