ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు వరుసగా బీజేపీ నాయకులకు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని బీజేపీ ఎప్పటికి మరిచిపోలేదు. రాజస్థాన్ తన వ్యూహాలను ఎక్కుపెట్టేలోపే కాంగ్రెస్ నాయకులు తమ వ్యూహాలను ప్రదర్శించి బీజేపీని మట్టుపెట్టారు. అది గతంలో రాజస్తాన్ ఎన్నికల్లో గెలవడం కంటే కూడా ఈ సంక్షోభం నుంచి బయటపడిన తీరు… కాంగ్రెస్ మళ్లీ మొగ్గతొడుగుతుందన్న ఆశకు అంకురార్పణగా చెప్పాలి. పూర్తిగా పార్టీ నుంచి బయటకు వెళ్లి, స్పీకరు నుంచి నోటీసులు కూడా అందుకుని, రెబల్ గా మారిన సచిన్ పైలట్ కోర్టు కెళ్లి… ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే అతి స్వల్పకాలంలోనే పార్టీలోకి తిరిగి వచ్చిన తీరు, బీజేపీకి షాకిచ్చిన తీరు ఒక అద్భుతమే. అన్ని ఆలోచించిన తరువాతే సచిన్ ను క్షేమించి, తిరిగి పార్టీలోకి ఆహ్వానించామని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది.
బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే తనంతట తాను అశోక్ గెహ్లాత్ తనంతట విశ్వాస పరీక్షకు సిద్ధం కావడం బీజేపీకి కాంగ్రెస్ ఇచ్చిన ట్విస్ట్. విశ్వాస పరీక్ష అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 21వ తేదీకి వాయిదా పడ్డాయి. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా అశోక్ గెహ్లాత్ కు సహకరించారు. మొత్తానికి ఇటీవల కాలంలో బీజేపీకి కాంగ్రెస్ మూడు చెరువుల నీళ్లు తాగించిన సంఘటన ఇది. రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ తన దమ్ము ఎంతో బీజేపీకి చూపించింది. కాంగ్రెస్ ఇలాగే పరిస్థితులకు తగ్గట్టు తన వ్యూహాలను మార్చుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ బీజేపీకి చెక్ పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ పండితులు చెప్తున్నారు.