ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో పొత్తులే కీలకం కానున్నాయి. చంద్రబాబు మోదీ పవన్ కలిసి తమ పార్టీల ద్వారా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు ఈ పార్టీలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోదీ చంద్రబాబు భేటీ నేపథ్యంలో ఏపీలో ఏం జరగబోతుందో అనే టెన్షన్ మొదలైంది. డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో జరిగే ఒక సమావేశంకు బాబుకు ఆహ్వానం అందింది.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ వచ్చిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు ద్వారా బెనిఫిట్ కలుగుతుందని భావిస్తే మోదీ సైతం పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ మీటింగ్ లో భాగంగా మోదీ చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. మళ్లీ చంద్రబాబు మోదీ కలిసి ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
మోదీ చంద్రబాబు మధ్య దూరం తగ్గుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మోదీ చంద్రబాబులను కలపడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. ఏపీ రాజకీయ లెక్కల్లో ఏవైనా మార్పులు వస్తాయేమో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఏపీ రాజకీయాలలో సంచలనాలు నమోదు కావడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో వైసీపీకి షాకులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ సరైన దిశగా అడుగులు వేయాల్సి ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉంది.