రాజకీయం అంటేనే ముందు దారి చూపించి ఆ వెనుక గోతులు తీయడం. ఇది నేటి రాజకీయ వ్యవస్థలో ఓ భాగం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహా..ఓహో అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఓవైపు ఆకాశానికి ఎత్తేస్తూనే మరోవైపు ఎక్కడ పెట్టాలో? అక్కడ పెడుతోందా పార్టీ. అయినా కేంద్రంలో ఉన్న పార్టీ కన్నా రాష్ర్టంలో ఉన్న పార్టీకే ఇప్పుడు మోదీ అవసరం ఎంతైనా ఉంది. అది ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కావొచ్చు…రాష్ర్ట పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు కావొచ్చు. కేంద్రంపై ఆక్రోశాన్ని వెళ్లగక్కితే పరిస్థితి ఎలా ఉంటుంది! అన్నదానికి తెలంగాణ రాష్ర్టాన్ని ఉదహరించవచ్చు.
మొదటి నుంచి తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కి-బీజేపీ పొసగలేదు. దీంతో కేసీఆర్ పలు సందర్భాల్లో కేంద్రంపై బహిరంగంగానే ఆవేశాన్ని వెళ్లగక్కారు. మోదీ ప్యాకేజీలను దుయ్యబట్టే ప్రయత్నం చేసారు. ప్రజల్లో మోదీ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేసారు. ఇదంతా ఓపెన్ గానే జరిగింది. కానీ కేంద్రం మాత్రం కేసీఆర్ ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి! ఆటాడుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్ట్ ల విషయంలో కేంద్రం వైఖరి కేసీఆర్ కి వ్యతిరేకంగానే వినిపిస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్ ఓపెన్ గానే చెప్పారు. ఏపీని వెనకేసుకొస్తుందని…తెలంగాణ అంటే చిన్న చూపు చూస్తుందని బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేసారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి విషయంలో కేంద్రానికి పంపిన కొన్ని బిల్లుల విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శించి తమ ప్రాబల్యాన్ని చాటే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదా పై స్పందించదు.. శాసన మండలి రద్దు విషయాన్ని తేల్చదు. వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు వై వేటు వేయాలని అభ్యర్ధించినా అందులో ఎలాంటి పురోగతి ఉండదు. మొత్తంగా ఏపీ విషయంలో కేంద్రం అడుతోన్న ఆట ఇది. ప్రత్యేక హోదాపై ఒత్తిడి తీసుకొచ్చేంత ధైర్యం జగన్ చేయరు. ఇది జగన్ ఆడుతోన్న అతి ముఖ్యమైన ఆట. టెక్నికల్ గా ఇలా ఎవరి సమస్యలు వారివి. పొలిటికల్ సినారేలో ఎవరూ తక్కువేం కాదు. ఎవరికి వారే గేమ్ లు ఆడేస్తారు కదా.