కొత్త డౌట్: జగన్ కు శ్రీదేవి రిక్వస్ట్!

ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు తాజాగ జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాన్ కు ఓటువేయరనేది జగన్ & కో కి క్లియర్ గా తెలిసిన విషయం. ఇదే సమయంలో… వీరిద్దరు కాకుండా మరొకిద్దరు వైకాపా ఎమ్మెల్యేలు తమకు ఓటువేస్తారనేది బాబు పొలిటికల్ బిజినెస్ పై ఉన్న నమ్మకం. రాజకీయాల్లో అమ్మడం – కొనడం విషయంలో పీ.హెచ్.డీ చేశారన్న పేరుసంపాదించుకున్న బాబు… తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదేపనిచేశారని అంటున్నారు. దీంతో… ఎవరాఇద్దరూ అంటూ షాక్ నుంచి తేరుకుని జుట్టుపిక్కున్నారు వైకాపా నేతలు.

అవును… వైసీపీలో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు…? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చంతా దీని చుట్టూనే తిరుగుతోంది. టీడీపీకి వాస్తవంగా 19 ఓట్లు ఉన్నాయి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం లను కలుపుకుంటే.. 21. కానీ మరో రెండు ఓట్లు అదనంగా పడ్డాయి. ఈ రెండు ఓట్లు వేసింది ఎవరు, వైసీపీలో జగన్ ని కాదని అంత సాహసం చేసింది ఎవరు..? వైసీపీ నేతలు నేరుగా బయటపడటం లేదు కానీ మీడియాకి ఇచ్చిన లీకుల ప్రకారం… వారిలో ఒకరు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. కాగా, మరొకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వీరిద్దరి పేర్లు మీడియాలో కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి మాత్రం తనను అనుమానించొద్దని అంటున్నారు.

అవును… తాను పార్టీని వదిలిపెట్టి వెళ్లే రకం కాదని, పార్టీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదని చెబుతున్నారు శ్రీదేవి. తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నా కూడా.. ఇటీవల ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ని అక్కడ వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించారు జగన్. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదను చూసి దెబ్బకొట్టారని కథనాలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే… సమస్యే లేదని, తనను అనుమానించొద్దని, కష్టమైన సుఖమైన వైకాపాతోనే తన ప్రయాణమని చెప్పుకొస్తున్నారు.

ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయానికొస్తే… వచ్చేసారి తనకు వైసీపీ టికెట్ రాదనే అనుమానంతోనే ఆయన టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కేవలం ప్రచారాలే కానీ వారిద్దరూ ఓటు టీడీపీకి వేశారనడానికి రుజువులేవీ లేవు! అయితే ఈ కామెంట్లపైనా, అనుమానాలపైనా… శ్రీదేవి స్పందించారు కానీ… మేకపాటి ఇప్పటికీ స్పందించలేదు! దీంతో… మౌనమే అర్ధాంకీకారం అనుకోవాలని అంటున్నారు నేటిజన్లు!

ఈ విషయంలో… బాబు బేరానికి పడిపోయి డబ్బుకి అమ్ముడుపోయిన ఆ ఇద్దరూ ఎవరో తమకు తెలుసని, వారిపై తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతుండటం గమనార్హం!

అయితే… శ్రీదేవి ఇలా రిక్వస్ట్ పెట్టుకోవడంతో… మరి ఆ రెండో వ్యక్తి ఎవరా అనేదానిపై కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి అంటున్నారు వైకాపా శ్రేణులు!