సర్పంచ్ గా పోటి చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే కొడుకు

తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కారు జోరు సాగించింది. సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఎమ్మెల్యే తనయుడికి ఓటమి ఎదురైంది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దిన్ కొడుకు అఫ్సర్ మొయినొద్దీన్ ఓటమి పాలయ్యారు. కౌసర్ ఎంఐఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.

మెదక్ జిల్లా వెల్దూర్తి మండలంలోని బస్వాపూర్ లో అప్సర్ సర్పంచ్ గా  పోటి చేశారు. టిఆర్ఎస్ అభ్యర్ధి మల్లేషం గౌడ్ చేతిలో 60 ఓట్ల తేడాతో అప్సర్ ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యే కొడుకు ఓడిపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. కౌసర్ కూడా గత కొద్ది రోజులుగా గ్రామంలోనే ఉండి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్ధి కనీసం కొడుకును సర్పంచ్ గా గెలిపించుకోలేక పోయారని అంతా చర్చించుకున్నారు.

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4310  స్థానాల్లో 2600 స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. రెండు విడతల్లో కలిపి  8300 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 5300 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 1700 స్థానాల్లో విజయం సాధించారు.