ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు… స్థానంలో… ఎవరు మైకందుకుంటే పవన్ – బాబు లకు వాచిపోతోందా ఆమే మంత్రి రోజా అనుకోవాలేమో అని అంటుంటారు పరిశీలకులు. ఆవేశంగా మాట్లాడటం, బరువైన పదాలు వాడటం, ,ఊగిపోవడం, అసత్యాలు చెప్పడం వంటివాటికి తావులేకుండా.. చెప్పాలనుకున్న విషయం సూటిగా సుత్తిలేకుండా చెబుతారని అంటుంటారు.
ఈ క్రమంలో తాజాగా పవన్, చంద్రబాబులపై ఫైరయ్యారు మంత్రి రోజా! వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన అభ్యంతరకర కామెంట్స్ పై ఇంకా రాజకీయ రగడ రగులుతూనే ఉన్న నేపథ్యంలో… ఏపీలో అదృశ్యమైన బాలికలు, యువతుల సంఖ్య ఇదీ అంటూ ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ చెప్పిన లెక్కల అనంతరం… ఈ వ్యవహారం మరింతగా రాజుకుందని తెలుస్తోంది. ఈ సమయంలో పవన్ పై రోజా తనదైన శైలిలో స్పందించారు.
అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి రోజా… అటు చంద్రబాబుపైనా, ఇటు పవన్ పైనా తీవ్రవ్యాఖ్యలు చేశారు. అసలు సిస్సలు సీమ ద్రోహి చంద్రబాబే అని ఆమె మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీమకు ఇసుమంతైనా చేయలేదని తప్పు పట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సీమ ప్రాజెక్టులు గుర్తు రాలేదా అని రోజా సూటిగా ప్రశ్నించారు.
ఇక చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఆయన ఏనాడూ కనిపెట్టలేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో గంజాయి హెరిటేజ్ లో మాత్రమే దొరుకుతుందని, రాష్ట్రంలో ఇంకెక్కడా దొరకడంలేదని.. నారావారిపల్లెలో ఎర్రచందనం వ్యాపారం సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకడంలేదని రోజా స్పష్టం చేశారు.
అనంతరం కరువుకు చంద్రబాబుకూ అవినాభావ సంబంధం ఉందని.. అది అలాంటి ఇలాంటి సంబందం కాదని చెప్ప్పిన రోజా… చంద్రబాబు పాలనలో కరవులు తప్ప, వర్షాలు పడలేదని విమర్శించారు. చంద్రబాబు – కరువు కవల పిల్లలని వెటకరించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిల మిస్సింగ్ పై పవన్ చేసిన ఆరోపణలపై స్పందించిన రోజా… పవన్ కల్యాణ్ వల్ల రాష్ట్రంలో ఎంత మంది మిస్ అయ్యారో లెక్కలు తీయండి అని వ్యంగ్యంగా అన్నారు. పవన్ కు రాజకీయ అవగాహన లేదని.. ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప, ఒక్క ప్రశ్న ఎక్కువగా అడిగినా సమాధానం చెప్పలేడని రోజా ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో పవన్ ని అస్తమానం వార్డు మెంబరుగా కూడా గెలవని వ్యక్తి అని మాటలతో కుల్లబొడుస్తారనే పేరు సంపాదించుకున్న మంత్రి రోజా… మరోసారి అదే విషయాన్ని ఎత్తుకున్నారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవని పవన్ కు ఏ కేంద్ర సంస్థ వివరాలు ఇచ్చిందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
కాగా… రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… జగన్ దానకర్ణుడు, చంద్రబాబు కుంభకర్ణుడు అంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి శుక్రవారం… చంద్రబాబు – పవన్ ఇద్దరిపైనా తీవ్రస్థాయిలో ఫైరయ్యారు!