మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వ వైఖిరిని స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana clarified the government's stance on the issue of three capitals

మూడు రాజధానుల అంశం మీద మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమరావతిలో నిర్మాణాలపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని చెప్పారు. అమరావతిలోని 29 గ్రామాలు రాష్ట్రంలో అంతర్భాగమేనని అన్నారు. భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కోసం మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ కూడా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Minister Botsa Satyanarayana clarified the government's stance on the issue of three capitals
Minister Botsa Satyanarayana clarified the government’s stance on the issue of three capitals

వైసీపీ పార్టీ కేంద్ర కార్యాయలంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్యనిర్వహణా రాజధాని విశాఖకు ఎప్పుడెళ్తున్నారని ప్రశ్నించగా దానికి సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రతి నిముషమూ ఆరాట పడుతున్నాం. విశాఖలో కార్యనిర్వహణా, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. శాసన రాజధాని అమరావతిలోని ఉంది కాబట్టి ఇక్కడ అభివృద్ధిపై దృష్టి పెట్టాం. దానిలో భాగంగానే అసంపూర్తిగా ఉండిపోయిన భవనాలను పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఇచ్చిన భూములని ప్లాట్లుగా అభివృద్ధి చేసి అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

తాత్కాలిక భవనాలకే చంద్రబాబు వందల కోట్లు వృధా చేశారు. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం కట్టి రోడ్లు కూడా వేయలేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు చంద్రబాబు గ్రాఫిక్స్‌లో ఓ భాగం. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి అరకొరగా ఆ రోడ్డు వేశారు. సీడ్ యాక్సిస్ రోడ్డును కాజా వరకు విస్తరించాలని ప్రణాళికలు వేస్తున్నాం. అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీగా ఎందుకు చేయలేదు?అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కి విర్రవీగితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. విశాఖలో భవనాలు కడుతుంటే ఎందుకు స్టే తెచ్చారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దుతాం’ అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.