నిప్పులు గక్కిన బొత్స సత్యనారాయణ – మండలిలో జగన్ కాలర్ ఎగరేసే సీన్ !

minister botsa fires on lokesh and chandra babu in ap assembly

అమరావతి : సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో నివర్‌ తుఫాను పంట నష్టం, ప్రభుత్వ చర్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స.. లోకేష్‌పై ఫైర్‌ అయ్యారు. ఆయన మాట్లాడుతూ..‘‘ ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. రైతుల ట్రాక్టర్‌ను బురద గుంటలోకి పోనివ్వటం తప్ప లోకేష్‌కు ఏం తెలుసు? టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో తెలియని వ్యక్తని, ఆయన ఎక్కడ ఏ పంట పండుతుందో చెబితే తాను తలదించుకుని కూర్చుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు.ట్రాక్టర్‌ను బురదలో దింపడమే కాకుండా దాన్ని రైతులతో బయటికి తీయించుకున్న వ్యక్తి లోకేష్. ‘చంద్రబాబు నాయుడు మనసులో మాట’‌ అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారు. ఆ పుస్తకం తెస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం మాట్లాడారో చూపిస్తాం. చైర్మన్ అవకాశమిస్తే‌ టీవీలో కూడా వేసి చూపిస్తాం’’అని అన్నారు.

minister botsa fires on lokesh and chandra babu in ap assembly
minister botsa fires on lokesh and chandra babu in ap assembly

బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి మాట్లాడుతూ… ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తన అభిప్రాయాలతో వెలువరించిన ‘మనసులో మాట’ అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అంటూ రాసుకున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందంటూ గతంలో ఎద్దేవా చేశారు. ఇప్పుడే నెట్లో కొట్టి చూశాను … మనసులో మాట పుస్తకం ఆన్‌లైన్‌లో కూడా తొలగించారు. మనసులో మాట పుస్తకం వారి ఇంట్లో ఉంటుంది కాబట్టి లోకేష్ దాన్ని తీసుకువస్తే.. చంద్రబాబు అన్న మాటలు చూపిస్తాం. వ్యవసాయంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్‌లో దొరకకుండా చేశారు’’ అని ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు.