జనసైనికులా.? బాబు బానిసలా.? మంత్రి అంబటి సూటి ప్రశ్న.!

‘యుద్ధానికి సిద్ధం అన్నావ్.. చంద్రబాబు సంకెక్కావ్.. పిరికోళ్ళందరూ కలిసే రండి చూసుకుందాం..’ అంటూ వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరమైన ట్వీటేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.అంతే కాదు, ‘జనసైనికులా.? బాబు బానిసలా.?’ అని జనసేన కార్యకర్తల్ని ఉద్దేశించి మరో ట్వీట్ వేశారు అంబటి రాంబాబు. అంతకు ముందు ‘ఒకే ఒక్క అసహనంతో నిన్ను నమ్మకున్నవాళ్ళందరినీ చెప్పుతో కొట్టించావ్ పవన్ కళ్యాణ్..’ అని అంబటి రాంబబు ట్వీట్ చేశారు.

మంత్రివా.? వైఎస్ జగన్ బానిసవా.?అంబటి రాంబాబు ట్వీట్లకు కౌంటర్ ఎటాక్ కూడా అంతే స్థాయిలో వస్తోంది. మంత్రివా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బానసవా.? అని ఓ జనసైనికుడు అంబటి రాంబాబుని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు.

మరో జనసైనికుడైతే, ‘నీలి పార్టీ నాయకుడివా.? నీలి చిత్రాల కథానాయకుడివా.?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇంకో నెటిజన్ మరీ దారుణంగా, ‘నీ భార్యకి మొగుడివా.. సంజన, సుకన్యలకి విటుడివా..’ అంటూ జుగుప్సాకరమైన రీతిలో స్పందించాడు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జనసైనికులను పూర్తిస్థాయిలో రెచ్చగొట్టేశారా.? అంటే, ఔననే అనుకోవాలేమో. లేకపోతే, ఈ స్థాయిలో ఇంతకు ముందెన్నడూ వైసీపీ మీద కౌంటర్ ఎటాక్స్ పడలేదు. తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లు తయారైంది పరిస్థితి.