ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడుమీడియా ఎదుట స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడిని ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. కాకపోతే ఈ ఘటనకు రాజకీయరంగు పులిమి లబ్ది పొందాలనుకుంటే అంగీకరించబోము అని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. “ఇది ఆపరేషన్ గరుడలో భాగమే అన్నారు. ఆపరేషన్ గరుడ వీడియో చూస్తే అందరికి అర్ధం అవుతుందని తెలిపారు. రెండుసార్లు రెక్కీ చేసి, మూడోసారి ప్రాణాపాయం లేని పోతూ పొడుస్తారని ఆపరేషన్ గరుడలో ఉందన్నారు. నటుడు శివాజీ చెప్పినట్టే జరుగుతున్నాయని గుర్తు చేశారు”. ఘటన జరిగిన రెండు నిమిషాల్లోనే ఢిల్లీలో ఉన్న నరసింహన్ తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, రిపోర్ట్ డిటైల్డ్ గా కావాలని అడగడమేంటని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.
దాడి చేసిన మనిషి దొరకకపోతే విమర్శలు చేయడం సమర్ధనీయం కానీ ఆ వ్యక్తి వైసీపీ అభిమానిని అని చెబుతున్న టీడీపీ ని విమర్శిస్తున్నారు. మీ విమర్శలను స్వీకరిస్తాం కానీ దాడి చేసిన వ్యక్తిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదన్నారు. మీ అభిమాని మిమ్మల్ని ఎందుకు పొడిచాడో మాకు తెలియదు. ఆ విషయాలు దర్యాప్తులో వెల్లడవుతాయి.
ప్రతిపక్ష నేత జగన్ అప్రమత్తంగా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అధికార ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ, జనసేన, బీజేపీ, టీఆరెస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ఎదుట తెలిపారు.