మెగాస్టార్ చిరంజీవి: ఏపీ రాజకీయాల్లో కింగ్.? కింగ్ మేకర్..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, తిరిగి రాజకీయాల్లోకి రానని చిరంజీవి పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేశాక, సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనని చెప్పారుగానీ.. తిరిగి సినిమాల్లోకి వచ్చారు చిరంజీవి. సో, రాజకీయాల్లోకి మళ్ళీ ఆయన రా-ఎంట్రీ ఇవ్వబోరని ఎలా నమ్మగలం.?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ముఖ్య మంత్రి పదవి కోసం పోటీ పడనున్నాయి. టీడీపీ – వైసీపీ – జనసేన.. ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. ఇందులో టీడీపీ – జనసేన కలిసి కూటమి కడతాయనే ప్రచారం జరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి తెరవెనుకాల మంత్రాంగం షురూ చేశారనీ, ఒకప్పటి ప్రజారాజ్యం నేతలతో ఆయన తిరిగి మంతనాలు మొదలు పెట్టారనీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ప్రజారాజ్యం పాత నేతల్లో కొందరు టీడీపీలోనూ, మరికొందరు వైసీపీలోనూ, ఇంకొందరు బీజేపీలోనూ వున్నారు. కొందరు ఇంకా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని వున్నారు కూడా.

జనసేనలో వున్న ఒకప్పటి ప్రజారాజ్యం నేతల సంగతి సరే సరి. వీరందరితోనూ చిరంజీవి టచ్‌లోకి వెళుతున్నారన్న ప్రచారం ఎంతవరకు నిజం.? కింగ్ అయ్యే ఉద్దేశ్యం లేకపోయినా, చిరంజీవి కింగ్ మేకర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు నిజమేనా.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చారు.

అది చంద్రబాబుకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అర్థమవుతోంది. ఈ మార్పు వెనుక చిరంజీవి వున్నారని టీడీపీ, వైసీపీ అనుమానిస్తున్నాయి. పైకి మాత్రం అంతా గప్ చిప్ అన్నట్లున్నారు ఈ విషయంలో.