మీడియా మొఘల్ ఖేల్ ఖతం.! రామోజీరావుకే ఎందుకిలా.?

ఈనాడు గ్రూపు సంస్థలన్నీ మడియా మొఘల్ రామోజీరావు ‘దర్పం’ మీదనే ఆదారపడి వున్నాయ్.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వారసులు వున్నా, రామోజీరావు తరహాలో చాణక్యం ప్రదర్శించి, ఆయా వ్యాపారాల్ని సొంతంగా, సమర్థవంతంగా నడిపేంత సత్తా కలిగి వున్నారా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఎప్పుడైతే రామోజీరావు, మార్గదర్శి కేసులో సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు మంచం పట్టారో.. ఆ తర్వాత మీడియా, వ్యాపార వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ రామోజీరావు పరపతి పాతాళానికి పడిపోయిందన్న చర్చ జరుగుతోంది. ఆయనేమీ సాధారణ పొలిటీషియన్ కాదు, పబ్లిసిటీ స్టంట్లు చేయడానికి.!

ఎనిమిది పదుల వయసులో.. తొంభైలకు దగ్గర పడుతున్నారు రామోజీరావు. వృద్ధాప్య సమస్యలుంటాయ్. ఇదివరకటిలా బయట ఎక్కువగా ఆయన కనిపించడంలేదు. బయట అంటే, ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ.. అని అర్థం ఇక్కడ. సో, రామోజీరావు.. సీఐడీ విచారణ సందర్భంగా మంచానికే పరిమితం అవడమనేది అబద్ధం కాదు.

మార్గదర్శి కేసు కారణంగానే ఆయన మంచాన పడ్డారన్నది ఓ వాదన. గతంలో పరిస్థితి వేరు. అప్పట్లో ఓపిక, తెగువ వుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదట. అందుకే, ‘ఈ వయసులో ఈ కష్టమెందుకు.?’ అన్న మనోవేదనకు రామోజీ గురయ్యారనీ, ఆ కారణంగానే రామోజీ మంచాన పడ్డారనీ ఓ వాదన వినిపిస్తోంది.

‘తప్పు జగన్.. ఈ వయసులో ఆ పెద్దాయన్ని ఇబ్బంది పెట్టకూడదు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం జగన్‌కి సుద్దులు.. రామోజీ పట్ల సానుభూతి.. కనిపిస్తోంది. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.! తన మీడియా ద్వారా, టీడీపీ ప్రత్యర్థులపై విషం చిమ్మే రామోజీకి, తగిన శాస్తి జరిగిందనేవారూ లేకపోలేదు.