షాకింగ్ : 33 మంది వాలంటీర్ల సామూహిక రాజీనామా .. ఎందుకంటే ?

ఏపీలో ఒకేసారి 33 మంది వలంటీర్లు సామూహికంగా రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో 33 మంది వలంటీర్లు సామూహికంగా రాజీనామా చేశారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ అభిమానులను గెలిపించుకునేందుకే తామంతా సామూహికంగా రాజీనామా చేసినట్లు వలంటీర్లు స్పష్టం చేశారు. నార్తురాజుపాళెంలోని వీసీఆర్‌ అతిథి గృహంలో రాజీనామా చేసిన వలంటీర్లు బుధవారం విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వమిచ్చే గౌరవవేతనం కోసం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సేవా దృక్పథంతో తాము పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్‌ పేరుతో తమను దూరం పెట్టడంతో.. రాజీనామా చేసి స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ అభిమానులను గెలిపించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.

ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికారంలో ఉన్న వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. టీడీపీ మద్దతుదారులు కూడా అధికసంఖ్యలో బరిలోకి నిలిచి బలమైన పోటీనిచ్చి, గణనీయమైన స్థానాలను దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. ఇదే క్రమంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో చిత్రి విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి.