మార్గదర్శి స్కామ్.! బొమ్మాళీ నిన్నొదలా.!

మీడియా మొఘల్ రామోజీరావు మెడకి మార్గదర్శి స్కామ్ గట్టిగానే ఉచ్చు బిగుసుకున్నట్లుంది. సాధారణంగా అయితే, ఇలాంటి విషయాల్ని రామోజీరావు పెద్దగా పట్టించుకోరు. జాతీయ స్థాయిలో ఆయనకున్న పలుకుబడి అలాంటిది.

కానీ, ఈసారి వ్యవహారం తేడా కొట్టింది. మార్గదర్శి స్కామ్‌లో రామోజీ నిండా మునిగిపోయారు. ఎలాంటి మతలబులూ లేకుండా వుంటే, ఏపీ సీఐడీని రామోజీ ఈపాటికి బురిడీ కొట్టించగలిగేవారే. అలా జరగడంలేదంటే, దానర్థమేంటి.?

మొన్నటికి మొన్న, మంచమ్మీద అచేతనావస్థలో వున్నట్లుగా హైడ్రామా సృష్టించినా, విచారణ నుంచి రామోజీ తప్పించుకోలేకపోయారు. ఈ కేసులో ముందు ముందు మళ్ళీ మళ్ళీ విచారణను రామోజీ ఎదుర్కోవాల్సి రావొచ్చు.

తాజాగా రామోజీ ఇంటికి ఏపీ సీఐడీ వెళ్ళింది. రామోజీరావు కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ని ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. తెలుగు రాష్ట్రాల్లో వున్న చిట్స్ గ్రూపులు, ఆ గ్రూపుల్లోని సభ్యులు, చెల్లింపులు, డిపాజిట్లు.. ఇలా అన్ని వివరాల్నీ సేకరిస్తున్నారు ఏపీ సీఐడీ అధికారులు.

ఇప్పటికే ఏపీ సీఐడీ, రామోజీకి సంబంధించి పలు ఆస్తుల్ని అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల అటాచ్ అక్రమం, రాజకీయ కుట్ర.. అంటూ రామోజీ, తన మీడియా సంస్థల ద్వారా గగ్గోలు పెడుతున్నారు. ఈ వయసులో రామోజీకి ఈ తలనొప్పి అవసరమా.? అని తెలుగుదేశం పార్టీ తెగ బాధపడిపోతోంది.

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌ని దొంగా.. అని అభివర్ణించిన టీడీపీ అను‘కుల’ మీడియా, ఇప్పుడు ‘దొంగతనం’ కేసులో అడ్డంగా బుక్కయిపోవడం ఆశ్చర్యకరమే మరి.!