షర్మిలను కలిసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి… చెల్లితో రాయబారాలు చేస్తున్న జగన్

Mangalagiri MLA Alla Ramakrishnareddy's meeting with YS Sharmila recently became hot toppic

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు కొత్త పార్టీ పెడుతున్నానంటూ వైఎస్ షర్మిల ప్రకటించటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలమైంది. దీంతో “వైఎస్” కుటుంబంలో విభేదాలున్నాయని రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది. ఈ వ్యవహారం జగన్ కు కొంత తలనొప్పిగా మారిందట. షర్మిలతో రాయబారం నడిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిలతో భేటీ అయిన ఆర్కే, వివిధ అంశాలపై చర్చించిన తరువాత, అక్కడే ఉన్న బ్రదర్ అనిల్ కుమార్ తో కూడా సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీ దాదాపుగా గంటకు పైగా సాగటంతో, ఇప్పుడు ఇది కొత్త చర్చకు దారి తీసింది.

Mangalagiri MLA Alla Ramakrishnareddy's meeting with YS Sharmila recently became hot toppic
Mangalagiri MLA Alla Ramakrishnareddy’s meeting with YS Sharmila recently became hot toppic

ఈ భేటీ పై స్పందించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నేను జగన్ మోహన్ రెడ్డి అనుమతి తీసుకుని, షర్మిల వద్దకు వచ్చానని చెప్పారు. కాకపోతే ఇందులో రాజకీయం ఏమి లేదని, వైఎస్ఆర్ కుటుంబం మొత్తంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ అనుబంధంతోనే వచ్చి కలిసాను తప్ప ఇందులో ఏమి లేదని చెప్పారు. అయితే ఆర్కే వచ్చి షర్మిలను కలవటం వెనుక, కేవలం మర్యాదపూర్వక భేటీ కాదని మాత్రం అర్ధం అవుతుంది. ఎందుకుంటే ఒక పక్క షర్మిల,బిజీబిజీ గా ఉన్నారు. అభిమానులతో మీటింగ్ లు పెట్టుకున్నారు. ఇంత బిజీ టైంలో అంట సేపు ఆర్కేను కలవటం వెనుక కచ్చితంగా ఏదో రాజకీయం ఉందని అంటున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సంబందించిన కీలక నేతలు కూడా, షర్మిల పార్టీ పెట్టే అంశం పై స్పందించటానికి ఇబ్బంది పడుతున్నారు. షర్మిల సొంతగా నిర్ణయం తీసుకుని పార్టీ పెట్టటం అనేది, జగన్ ఇమేజ్ కు డ్యామేజ్ అని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి నేత కూడా, డైరెక్ట్ గా ఏమి చెప్పలేక, షర్మిల ప్రెస్ మీట్ వీడియో చూపించినా, అది మార్ఫింగ్ అని చెప్పి తప్పించుకునే పరిస్థితి. అలాగే ప్రత్యర్ధి పార్టీల నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల దాడి మొదలైంది. ఒక చెల్లి ఇప్పటికే కోర్టుకు వెళ్లి సిబిఐ ఎంక్వయిరీ కోసం చూస్తుంటే, మరో చెల్లి ఏకంగా పార్టీ పెట్టింది, నువ్వా విశ్వాసనీయత గురించి మాట్లాడేది అంటూ, ఎదురు దాడి చేస్తున్నారు.

ఈ సందర్భంలోనే, జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూతగా ఆర్కే వచ్చారా అనే అంశం పై కూడా చర్చ జరుగుతంది. ముఖ్యంగా గంట సేపు మాట్లాడటం అనేది కచ్చితంగా రాజీ ఫార్ములా కోసమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం ఇటీవల ముగిసింది. త్వరలో మరిన్ని జిల్లాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 21న ఖమ్మంలో వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.