మమత చంద్రబాబును ఎందుకు పట్టించుకోవడంలేదు?

(PK)

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానని, బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నానని చంద్రబాబు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఆయన్ను పట్టించుకోవడంలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి మమత హాజరైనా అది మొక్కుబడేనట. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానం అందినా ఫైర్‌బ్రాండ్‌ మమత స్పందించలేదు. ఆమెను అక్కడికి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని సమాచారం. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొస్తున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నా దాన్ని మమత తొలి నుంచి సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఎందుకంటె ఈ ప్రయత్నాల వెనుక రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రమోట్‌ చేసే తంతు నడుస్తుండడాన్ని ఆమె జీర్ణించుకోవడంలేదు.

మొదట్లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి రాహుల్‌ను భుజానికెత్తుకోగా ఇప్పుడు చంద్రబాబు ఆ బాధ్యతను స్వీకరించారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమన్నట్లు తిరుగుతూ బీజేపీ ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు తెగ తంటాలు పడుతున్నారు.

కానీ చంద్రబాబు తీరు మమతకు అసలు నచ్చడంలేదని ఢిల్లీ వర్గాల సమాచారం. ఆయన కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీతో సమావేశమైనప్పుడు ఆమె తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంతో బాబు సైలెంట్‌ అవ్వక తవ్వలేదు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి వచ్చినా రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి చంద్రబాబు వత్తాసు పలకడంతో మమతకు చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు.
అందుకే ఆమె ప్రత్యామ్నాయంగా మరో కూటమిని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రధానిమంత్రి కావాలని కలలుకంటున్న మమతకు చంద్రబాబుకు అడ్డంకిగా మారి గండి కొడుతుండడాన్ని ఆమె సహించలేకపోతున్నారు.

కాంగ్రెస్, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు తన వెంట వస్తాయని నమ్ముతున్న వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఒక వ్యూహం ప్రకారం ముందుకెళుతున్నారు. కానీ చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో జతకట్టి జాతీయ స్థాయిలో బలహీన పడిన కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు కల్పించేలా వ్యవహరిస్తుండడం ఆమెకు మింగుపడడంలేదు. అందుకు రాహుల్‌కు మద్ధతుగా చంద్రబాబు చెబుతున్న కూటమిని భగ్నం చేసేలా వ్యూహం రూపొందించిన మమత త్వరలో దాన్ని బయటపెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌కు మద్ధతుగా చంద్రబాబు చేస్తున్న లాబీయింగ్‌ను వ్యతిరేకిస్తున్న మమత త్వరలో బాబుకు గట్టి ఝలక్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.