బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో కూటమికే పవర్

తెలంగాణలో మహాకూటమికే స్పష్టమైన అధికారం రానన్నట్లు జాతీయ సర్వే సంస్థ సి ఓటర్ వెల్లడించింది.

మహా కూటమికి 64 పైగా స్థానాలు దక్కనున్నట్లు ఏబిపి న్యూస్ – సి ఓటర్ వెల్లడించింది.

అధికార టిఆర్ఎస్ పార్టీకి 42 స్థానాలు వస్తాయని తేల్చింది.

ఇతరులకు 9 సీట్లు వస్తాయని లెక్కలు వెల్లడించింది.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి 4 సీట్లు దక్కుతాయని తేల్చింది.

 

మహాకూటమిలో తెలంగాణజన సమితి ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా సి ఓటర్ సర్వే తేల్చింది.

జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మూడు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాయి. ఈ సర్వేల్లో రెండు సర్వేలు కూటమికి అధికారం రానున్నట్లు ప్రకటించగా ఒక సర్వే మాత్రం టిఆర్ఎస్ కే అధికారం అంటూ ప్రకటించింది.

రిపబ్లిక్ టివి నిర్వహించిన (పార్లమెంట్ సభ్యుల కోణంలో) సర్వేలో కాంగ్రెస్ అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోబోతున్నట్లు తేల్చింది. అంతేకాకుండా ఎబిపి న్యూస్-

సి ఓటర్ సర్వేలోనూ కూటమిదే రాజ్యం అంటూ వెల్లడించింది.

కానీ ఈ రెండు సర్వేలకు భిన్నంగా ఇండియా టుడే మాత్రం టిఆర్ఎస్ పార్టీకే తెలంగాణలో అధికారం దక్కుతుందని తేల్చింది. కేసిఆర్ ప్రతిష్ట పెరుతూ ఉన్నట్లు అంచనా వేసింది ఇండియా టుడే.

మొత్తానికి తెలంగాణలో రెండు జాతీయ సర్వే సంస్థలు కూటమిదే అధికారం అని చెప్పగా ఒక జాతీయ సర్వే సంస్థ మాత్రం టిఆర్ఎస్ దే అధికారం అని చెప్పింది.