Madhavi Latha: తాడిపత్రి వాళ్లంతా పతివ్రతల… జేసీ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మాధవి లత?

Madhavi Latha: కూటమి పార్టీలలో విభేదాలు చోటు చేసుకున్నాయా అంటే అవునని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఎన్నో చోట్ల జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య గొడవలు చోటు చేసుకోగా బీజేపీ పార్టీకి చెందిన నాయకులతో కూడా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా కూటమి పార్టీలలో విభేదాలు వచ్చాయా అంటే అవును అనే స్పష్టమవుతుంది. తాజాగా తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బిజెపి నాయకుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

ముఖ్యంగా సినీ నటి మాధవి లత గురించి ఈయన చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా బిజెపి నాయకులు స్పందిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తాడిపత్రిలోని జేసీ పార్క్ వద్ద ఓన్లీ ఫర్ లేడీస్ అనే బోర్డు కనిపించింది అయితే ఈ విషయంపై మాధవి లత స్పందించి మహిళలు ఎవరు కూడా డిసెంబర్ 31వ తేదీ రాత్రి జేసీ పార్క్ వైపు వెళ్లకండి అంటూ ఈమె ఒక వీడియోని విడుదల చేశారు .ఇక ఈ వీడియో పై ఇటీవల ప్రభాకర్ రెడ్డి స్పందించారు.

మాధవి లతకు గొప్ప పేరు లేదు.. తను ఒక ప్రాస్టిట్యూట్. ఆమెను బీజేపీ పార్టీలో ఎందుకు పెట్టుకున్నారో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆమె వస్త్రధారణ పై కూడా ఈయన విమర్శలు కురిపించారు. ఇలా తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాధవి లత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

నన్ను చంపాలి అనుకుంటే నిరభ్యంతరంగా చంపవచ్చు.కానీ మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను. తెర మీద కనిపించే మహిళలు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు.. మరి తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి తాడిపత్రికి చెందిన వాళ్ళు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి రావద్దని ఈమె తెలిపారు. ఇలా జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ వారిని టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది. ఈ వ్యవహారం కాస్త చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లడంతో చంద్రబాబు నాయుడు కూడా జేసీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులను టార్గెట్ చేశారని స్పష్టమవుతుంది.