భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మృతిపై నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
“భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి వక్తులు మరొకరు ఉండరు. నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆశయాలను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒక సన్నిహితుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. మేము మిమ్మల్ని మిస్ అవుతాం సర్ అటల్ బిహారి వాజ్‌పేయి గారు” అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు.
India has lost one of its greatest sons whose contribution to politics, literature and diplomacy remains unmatched. The Telugu states have lost a dear friend who along with @ncbn played a key role in shaping their aspirations. We will miss you Sir #AtalBihariVaajpayee Ji
— Lokesh Nara (@naralokesh) August 16, 2018
నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ విమర్శల పాలవుతుంది. తన తండ్రిని ట్వీట్ లో మెన్షన్ చేయటంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ప్రకటించే ట్వీట్ లో కూడా మీ తండ్రి గొప్పని ప్రకటించుకోవటంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుస ట్వీట్లతో లోకేష్ పై వరుస కామెంట్లతో మండి పడుతున్నారు.
Prathi dantlo me babu ni irikinchatam avasarama! pic.twitter.com/QtVuiRYulJ
— Loose Cannon (@TollyCinemaGuy) August 16, 2018
I just don’t understand your concern to elevate your dad in every thing. Even in condolences? Have some shame
— Jagadeesh (@JAGADEESHREDDYK) August 16, 2018