అప్పటినుంచే లోకేశ్ పాదయాత్ర.. టీడీపీ పతనం ప్రారంభమైనట్టేనా? l

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ ఇప్పటివరకు రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. లోకేశ్ టీడీపీకి మేలు చేద్దామని మాట్లాడిన ప్రతి సందర్భంలో పార్టీకి జరిగిన మంచి కంటే చెడు ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ పాదయాత్ర తేదీ ఫిక్స్ అయింది. కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. 2023 సంవత్సరం జనవరి 27వ తేదీ నుంచి లోకేశ్ పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.

పార్టీ పెద్దల నిర్ణయం మేరకు ఆ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని లోకేశ్ ఫిక్స్ అయ్యారు. అయితే లోకేశ్ పాదయాత్ర పార్టీకి మంచి చేస్తుందని ఎవరూ భావించడం లేదు. ఈ పాదయాత్ర వల్ల లోకేశ్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్రలో ఇష్టానుసారం మాట్లాడితే పోయేది టీడీపీ పరువేననే సంగతి తెలిసిందే. టీడీపీకి లోకేశ్ ప్లస్ అవుతారో మైనస్ అవుతారో చూడాల్సి ఉంది.

లోకేశ్ పాదయాత్ర విషయంలో టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. లోకేశ్ ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా భారీ స్థాయిలో ట్రోల్స్ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లోకేశ్ పొలిటికల్ కెరీర్ కు సమాధి కట్టాలని వాళ్లు అనుకుంటున్నారు. వైసీపీ నేతల ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూడాల్సి ఉంది. లోకేశ్ మాత్రం పాదయాత్ర సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కావడంతో ఎన్నికల్లో గెలుపు కోసం లోకేశ్ పాదయాత్ర దిశగా అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేయనుండగా ఈసారైనా లోకేశ్ ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూడాల్సి ఉంది.