మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వయస్సు ప్రస్తుతం 72 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. వయస్సు సంబంధిత సమస్యల వల్ల రాష్ట్రంలో పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నా చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది. నందమూరి కుటుంబానికి టీడీపీ బాధ్యతలు అప్పగించే ఆలోచన లేని చంద్రబాబు లోకేశ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యేలా చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
లోకేశ్ సైతం గతంతో పోల్చి చూస్తే కొన్ని విషయాలలో ఎంతో మారారు. పార్టీ కార్యకర్తలతో, నేతలతో సమస్యల గురించి చర్చిస్తూ పార్టీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లోకేశ్ ను నమ్ముకోగా లోకేశ్ ముంచుతాడో తేల్చుతాడో అనే చర్చ జరుగుతోంది. లోకేశ్ లో పూర్తిస్థాయిలో మార్పు వచ్చినా గతంలో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు ఆయన సినీ కెరీర్ కు మైనస్ గా మారే ఛాన్స్ అయితే ఉంది.
లోకేశ్ కు తెలుగుదేశం పార్టీలో కూడా మద్దతు పెరుగుతోంది. తెలుగు సరిగ్గా పలకలేకపోవడం వల్ల లోకేశ్ పై పలు సందర్భాల్లో విమర్శలు వ్యక్తమై ఉండవచ్చని కెరీర్ పరంగా లోకేశ్ తీసుకునే నిర్ణయాలు మాత్రం రైటేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. లోకేశ్ లో వచ్చిన మార్పు వల్ల ఆయన పొలిటికల్ కెరీర్ కు మేలు జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పాదయాత్ర ద్వారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. లోకేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో లోకేశ్ సక్సె ఫుల్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. లోకేశ్ ను సీఎంగా చూడాలని తెలుగు తమ్ముళ్లు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.