టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ జగన్ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ర్టంలో టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తోన్న నేపథ్యంలో లోకేష్ తనదైన శైలిలో విమర్శించారు. నేడు ఈఎస్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఫ్యామిలీని పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్లిన లోకేష్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే? ప‌్రభుత్వం అక్రమంగా అరెస్ట్ లకు పాల్పడుతుందన్నారు. దేవుడు స్ర్కిప్ట్ ప్రకారం వడ్డీతో అన్ని లెక్కలు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేయాలన్నా..పెళ్లాంతో వాట్సాప్ చాట్ చేయాలన్నా జగన్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ర్టంలో రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగుతుందని ఎద్దేవా చేసారు. ఇసుక దందా పేరు చెప్పి కూన రవిని అరెస్ట్ చేసారు. మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోక్ గజపతి రాజుని తప్పించారన్నారు. 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని బాహుబలిలా ఢీకొన్న అచ్చెన్నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరుడుతున్న వారందర్నీ జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఏపీని మరో బీహార్ లా మార్చబోతున్నారని ఆక్షేపించారు. ఆర్ధికలావాదేవీలపై దెబ్బకొడుతున్నందుకే కొందరు నేతు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేసారు.
ఎందుకు పార్టీ మారారో ఆ ముగ్గురు చెప్పాలని డిమాండ్ చేసారు. తాత, తండ్రి ఇప్పుడు మనవడు టీడీపీని ఏమి చేయలేరని మండిపడ్డారు. పార్టీని తొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలేవి ఫలించవన్నారు లోకేష్. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటికి అరాచాకాలు ఎక్కువైపోయాయని మండిపడ్డారు. ప్రతీ పనిలోనూ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై వైకాపా నేతలు ఎలా బధులిస్తారో?