లిక్కర్ కేసుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్ ఉందా.. టీడీపీ ట్వీట్ నిజమేనా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు మధ్య లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరును తొలగిస్తే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తామని కేసీఆర్ సర్కార్ చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ రెండు పార్టీలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత గౌతు శిరీష ట్వీట్ చేయడం గమనార్హం.

టీడీపీ నేతలెవరూ ఈ వివాదం గురించి స్పందించకపోయినా గౌతు శిరీష చేసిన ట్వీట్ నిజమేనని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బయటపడిన రోజు ఊహించని స్థాయిలో హంగామా చేసిన తెరాస నేతలు తర్వాత సైలెన్స్ అయిపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్పందించే ఛాన్స్ లేదు.

ఈ వివాదం వల్ల మునుగోడు ఉపఎన్నిక సైతం సైడ్ అయిపోయింది. నవంబర్ నెల 3వ తేదీన ఈ ఉపఎన్నిక జరగాల్సి ఉండగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ప్రజలు బీజేపీని గెలిపించినా తెరాస చేసిన తప్పులు అందుకు ఒక విధంగా కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్ట్ తిరస్కరించడంతో పాటు ఏసీబీ ప్రొసీజర్స్ ఫాలో కాలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. లా అండ్ ఆర్డర్ పోలీసులకు రిమాండ్ చేసే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. పీసీ యాక్ట్ లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని వెల్లడించింది.