డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎల్‌ఐసీలో 9394 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా డిగ్రీ పాసైన వాళ్లకు శుభవార్త చెప్పింది. 9394 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ను ఎల్‌ఐసీ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో కూడా ఇందుకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం ఎల్‌ఐసీ ఈ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://licindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రిజర్వేషన్లకు అనుగుణంగా వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉంటాయి.

ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల కోసం కూడా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఏడాది వరకు ప్రొబేషన్ ఉంటుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు 700 రూపాయలు కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఇప్పటికే ముగిశాయి. ఎల్‌ఐసీ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతోంది. https://licindia.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.