స్పీకర్ భవనంపై కొత్త వివాదం

ఆయనెప్పుడూ ప్రజా జీవితంలో విలువల గురించే మాట్లాడుతుంటారు. ఎంఎల్ఏల ప్రవర్తనా నియమావళి గురించే లెక్షర్లిస్తుంటారు. కానీ తాను మాత్రం ఏమీ పట్టనట్లుంటారని వైసిపి నేతలంటున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్దమైపోయుండాలి. అవును ఆయనే ఏపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. అమరావతిలో అసెంబ్లీని పెట్టుకుని విజయవాడ, సత్తెనపల్లి, నరసరావుపేటలో ఇళ్ళు పెట్టుకుని హైదరాబాద్ లో ఇంటికి లక్ష రూపాయల అద్దె క్లైం చేసుకుంటున్నారని బయటపడింది.

24 గంటలూ లోటస్ పాండ్ లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించే మాట్లాడే చంద్రబాబునాయుడు ఇపుడు కోడెల నివాసం గురించి ఏమాట్లాడుతారో చూడాలి. ఎందుకంటే, హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీ, సచివాలయం తరలి వెళ్ళిపోయిన తర్వాత ఇక స్పీకర్ భవనం మాత్రం ఇక్కడెందుకు ? పైగా తన అధికార నివాసం పేరుతో ఆ భవనానికి నెలకు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు.

స్పీకర్ కార్యాలయం అసెంబ్లీలోనే ఉంటుంది.  స్పీకర్ ఇల్లు ఎక్కడైతే ఉంటుందో దాన్నే క్యాంపు కార్యాలయం అని కూడా అంటారు. కాబట్టి స్పీకర్ అద్దె ఇంట్లో ఉంటే దాని అద్దెను ప్రభుత్వమే భరించటంలో తప్పులేదు. కానీ గుంటూరు, నరసరావుపేట సత్తెనపల్లిలో ఉన్న నివాసాలు చాలవన్నట్లు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 7లోని భవనానికి నెలకు లక్ష రూపాయలు ఎందుకు తీసుకుంటున్నట్లు ?

పైగా కోడెల ఉంటున్న ఇంటి అడ్రస్సే మరో కార్యాలయం అడ్రస్ గా కూడా ఉన్నట్లు సమాచారం. టిడిడి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర మల్టీ ప్లెక్సెస్ సంస్ధ చిరునామా కూడా కోడెల ఉన్న ఇల్లేనట. అంటే ఎవరి అడ్రస్ లో ఎవరుంటున్నారు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. వేరేందర్ తన సంస్ధ కోసం అద్దె చెల్లిస్తుంటే అదే భవనానికి కోడెల అద్దె క్లైం  చేసే అవకాశం లేదు. లేదూ కోడెలే అద్దె క్లైం చేసుకుంటుంటే వీరేందర్ అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఎదుటివాళ్ళకు నీతులు చెప్పే పెద్దలే తాము పాటించకపోతేనే….