ఏపీ కరోనా అప్డేట్… ఆ రెండు జిల్లాలలో స్వల్పంగా పెరిగిన కేసులు

last 24 hours Corona update in Andhra pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 85,856 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,65,567 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 4, నెల్లూరులో 3, కృష్ణ 3, ప్రకాశం 2, తూర్పుగోదావరి 2, గుంటూరు 1, కర్నూలు 1, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరి 1, చొప్పున మొత్తం 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,395 కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 2,430 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,31,153 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

last 24 hours Corona update in Andhra pradesh

ప్రస్తుతం ఏపీలో 21,019 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,46,48,899 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. అనంతపూర్-59, చిత్తూరు- 377, ఈస్ట్ గోదావరి-410, గుంటూరు- 231, కడప- 125, కృష్ణ- 299, కర్నూల్- 49, నెల్లూరు-187, ప్రకాశం- 185, శ్రీకాకుళం- 45, విశాఖపట్నం- 170, విజయనగరం- 28, వెస్ట్ గోదావరి- 123, చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో నిన్న స్వల్పంగా కేసులు పెరగటం జరిగింది.

గమనిక: కరోనాను కట్టడి చేయాలంటే వాక్సిన్ తీసుకోవాలి. అంతేకాకుండా నిబంధనలను పాటించటం తప్పనిసరి.