బ్రేకింగ్ : కాంగ్రెస్ కు వూహించని షాక్, టిడిపిలోకి కోట్ల

 టిడిపితోె పొత్తుండదని కాంగ్రెస్ ప్రకటించడంతో నిరుత్సాహపడిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఏకంగా టిడిపిలోనే చేరబోతున్నారు. ఆయన తొలి నుంచి కాంగ్రెస్ టిడిపి కలసి పనిచేస్తాయని కార్యకర్తలకు చెబుతూ వస్తున్నారు. అపుడే తాను కూడా కర్నూల్ లో క్ సభకు గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. ఇలాంటపుడు టిడిపితో పొత్తుండదని నిన్న పార్టీ ప్రకటించడంతో ఆయన కంగుతిన్నారు. అందుకే టిడిపిలోకి వెళ్లాలనుకుంటున్నారు. రేపో మాపో నిర్ణయం ప్రకటిస్తారు.

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, పలుమార్లు మాజీ  కేంద్ర మంత్రి అయిన కోట్ల విజయ భాష్కర్ రెడ్డి కుమారుడు. రాష్ట్రం లో  కరుడు కట్టిన కాంగ్రెస్ కుటుంబం కోట్లది. రాష్ట్రంలో మారిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు లేదని నమ్మే స్థాయికి, భయపడే స్థాయికి ఈ కుటుంబం చేరుకుంది. దీనితో ఆయన కుటుంబం మీద కార్యకర్తల వత్తిడి తీవ్రమయింది. కాంగ్రెస్ స్వతంత్రగా గెలిచేపరిస్థితిలేదు కాబట్టి ఏదో ఒక పార్టీలోకి మాారాలని వత్తిడి వస్తున్నది. ఆయనకు  మిగిలిన అప్షన్ టిడిపియే అనుకుంటున్నారు.  రేపు  కార్యకర్తలు అభిమానులతో సమావేశమవుతున్నట్లు తెలిసింది.