కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జగిత్యాల జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించడానికి అపద్దర్మ మంత్రి కేటిఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వికారాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
ప్రమాదంలో 51 మంది చనిపోయారు. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4గురు చిన్నారులున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అపద్దర్మ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.