బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య మూవీ హీరో శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ గరుడ ఒక డ్రామా అని, చంద్రబాబుకు కేంద్రం నోటీసులు ఇస్తుంది అంటూ శివాజీ కొత్త నాటకానికి తెర లేపారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ గరుడపై సమగ్ర విచారణ జరపాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. కానీ పోలీసులు ఈ విషయంలో రెస్పాండ్ అవలేదు అని వెల్లడించారు.
బాబును వెనకేసుకొస్తూ శివాజీ చేస్తున్న వ్యాఖ్యల వలన అతడు చంద్రబాబుకి బినామీ అనే సందేహం కలుగుతుందంటూ వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని కోరారు.
కాగా నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతుందంటూ సంచలనం సృష్టించారు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తనకు ప్రాణహాని ఉందంటూ శివాజీ చేసిన ఆరోపణలపై కూడా కపిలేశ్వరయ్య విరుచుకుపడ్డారు.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న నిరసనలు స్వాగంతించాల్సిన అంశంగా కపిలేశ్వరయ్య పేర్కొన్నారు. ఏపీలో పెట్రోల్ ధరల పెంపుకు టీడీపీ ప్రభుత్వమే కారణం అన్న అయన… దేశంలో మరెక్కడా లేని రీతిలో ఏపీ ప్రజలపై టీడీపీ సర్కార్ పన్ను భారం మోపిందని విమర్శించారు. వెంటనే పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.