సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి పుత్ర వియోగం

ప్రముఖ జర్నలిస్ట్, రచయిత కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు పుత్రవియోగం మిగిలింది. కొమ్మినేని ఏకైక కుమారుడు శ్రీహర్ష మృత్యువాత పడ్డారు. రెండు రోజుల కిందట కెనడాలో కొమ్మినేని శ్రీహర్ష మరణించారు. ఆయన వయసు 32 ఏళ్ళు అని తెలుస్తోంది. మరణానికి కారణం అనారోగ్య సమస్యే అని సమాచారం.

రెండు సంవత్సరాల నుండి శ్రీహర్ష కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కెనడాలో ఆయన కేన్సర్ చికిత్స చేయించుకుంటున్నారు. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు కెనడా వెళ్లారు. రెండు రోజుల కిందట శ్రీహర్ష చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. దీంతో కొమ్మినేని దంపతులు పుత్రశోఖంలో మునిగిపోయారు. పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్లో పరామర్శిస్తున్నారు.

కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్సార్ గా సుపరిచితులు. కొమ్మినేని ప్రముఖ మీడియా సంస్థ సాక్షి టీవిలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. లైవ్ షో విత్ కేఎస్సార్ ను నిర్వహిస్తున్నారు. సాక్షి లో చేరక ముందు ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్ గా పని చేశారు. వీటికంటే ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దూరదర్శన్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ఎలెక్షన్ల మీద, శాసన సభ చర్చల సరళి మీద పుస్తకాలు రచించారు. ఆయన ఆంధ్రజ్యోతిలో అనేక ఆర్టికల్స్ రాసారు.

తెలంగాణ ఉద్యమకాలంలో కొమ్మినేని ఆంధ్ర జర్నలిస్టుగా ఉన్నప్పటికీ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆయన రెండు ప్రాంతాల వారి వాదనల టీవీ చర్చల్లో సమ ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతుంటారు. ఉదయం ఏడున్నర అయిందంటే తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ అవగాహన ఉన్నవారంతా ఎన్టీవీ ముందు కూర్చునేవారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పోటీగా అనీషారెడ్డి, బాబు ప్లాన్ ఏమిటి?  https://bit.ly/2xUwkLU

 

ఇది కూడా చదవండి

ఇద్దరు అమెరికా ఆర్థిక వేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి