విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీపై రాధా అసంతృప్తి చెందడం ఇటు వైసీపీలోనే కాదు ఇతర పార్టీల్లో కూడా హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి. దీంతో విజయవాడ వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో వంగవీటి రాధా విషయంపై మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి స్పందించారు. రాధాకు టికెట్ లేదు అనేది అవాస్తవం అని వెల్లడించారు. టికెట్ కేటాయించడం అనేది వ్యక్తుల సామర్ధ్యాన్ని బట్టి జరుగుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. సర్వేలో గెలవరని నివేదిక వస్తే నాకు కూడా టికెట్ ఇవ్వరు. ఈ ఒక్క ముక్కతో జగన్ ఆయా నియోజక వర్గాల్లో ఎవరైతే టీడీపీని ఓడించగలరో సర్వే చేసి మరీ టికెట్ కేటాయిస్తున్నట్టు చెప్పేశారు. సామర్ధ్యం లేనివారికి నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు. టిక్కెట్ కేటాయించడంలో జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి సీటు కీలకం కాబట్టి ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా జగన్ టికెట్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం.
రాధా విషయంలో మీడియా ప్రచారం వలనే ఇంత రాద్ధాంతం జరిగింది. అంతేకానీ జగన్ ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు అని తెలియజేసారు పార్ధసారధి. వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయడం శోచనీయంగా ఉంది అన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించాం. సమానవీయ కర్తల అంశం మీద శ్రీనివాస్ మాట్లాడటానికి అతనేమీ సమన్వయకర్త కాదన్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.