భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ పై స్పందించిన కోహ్లీ

పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశమంతా పాకిస్థాన్ పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది. దాయాదుల పోరు గురించి చెప్పనక్కర్లేదు. ఒక్కో దేశం పాక్ పై విరుచుకుపడుతుండడంతో పాక్ కూడా కొన్ని విషయాల్లో వెనక్కు తగ్గుతోంది. భారత్ పాక్ క్రికెట్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. అయితే వరల్డ్ కప్ లో పాక్ తో మ్యాచ్ ఆడాలా వద్దా అనే దాని పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“పాక్ తో భారత్ మ్యాచ్ ఆడాలా వద్దా అనేది ప్రభ్తుత్వ నిర్ణయిస్తుంది. భారత ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాం. ఇప్పటికే బిసిసిఐ పాక్ తో మ్యాచ్ వద్దని ఐసిసికి లేఖ రాసింది. దీనిని నేను సమర్ధిస్తున్నాను.” అని విరాట్ కోహ్లీ అన్నారు.