టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యకుండు నందమూరి బాలకృష్ణ ఎప్పుడో ఒకసారి బయటికొస్తారు. వచ్చినా ఎప్పుడో కానీ మాట్లాడారు. అయితే ఆయన అరుదుగా మాట్లాడే ఆ మాటలే దుమారమైపోతాయి. గత కొన్ని నెలలుగా అధికార, విపక్షాల నడుమ పలు విహస్యల్లో తెగని పోరు నడుస్తోంది. రెండు పార్టీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇన్ని గొడవలు జరుగుతుంటే బాలకృష్ణ ఈమధ్యే అనంతపురంలో పర్యటించి ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పొన్నిలో పనిగా పేకాట శిబిరాల నిర్వహణ విషయంలో వైసీపీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలకు కౌంటర్లు వేశారు. ఎంతదూరమైనా వెళ్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకు మొదట్లో కొడాలి నాని రియాక్ట్ కాలేదు.
దీంతో నానికి నందమూరి కుటుంబం అంటే ఎనలేని ప్రేమ అని అందుకే బాలయ్యకు కౌంటర్ ఇవ్వలేదని, ఇప్పటివరకు తన జోలికొచ్చిన ఎవ్వరినీ వదిలిపెట్టని నాని బాలయ్య విషయంలో మెత్తబడ్డారని అనుకున్నారు. కానీ నాని మాత్రం అలాంటిదేం లేదని తేల్చిపారేశారు. నేనేమీ ఆయన పక్కన జాతకాలు చెప్పుకుంటూ ఉండే సత్యనారాయణ చౌదరిని కాదని, జాతకాలు మార్చే కొడాలి నాని అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన బావని, అల్లుడిని తిడుతుంటే.. ఆయన చూస్తూ ఉంటాడని నేనైతే అనుకోను. కాకపోతే ఇక్కడ సత్యనారాయణ చౌదరిలు ఎవరూ లేరు. ఇక్కడ ఉంది జాతకాలు మార్చే కొడాలి నాని అన్నారు.
నాని మాటల్లో ఎక్కడ బాలయ్యను తిడుతున్న శబ్దం వినిపించకపోయినా లోపల మాత్రం నా జోలికి రావొద్దని హెచ్చరించినట్టే ఉంది. మరి తాను అంతలా అభిమానించే హరికృష్ణ సోదరుడిని కూడ నాని ఖాతరు చేయలేదంటే కారణం వెనకున్న జగన్ అనే అనాలి. జగన్ కు నాని మంచి సన్నిహితుడు. అన్ని సమయాల్లోనూ అండగా ఉంటుంటారు. ప్రతిపక్షం మీద చెలరేగిపొమ్మని మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించిందే ఆయన. అలాంటప్పుడు నాని అవతల ఉన్నది ఎంతటి వారైనా ఎందుకు లెక్కచేస్తారు. మరి నాని మాటలకు బాలయ్య కౌంటర్ వేస్తారా అంటే ఖచ్చితంగా వేయరు. ఎందుకంటే ఆయన మరోసారి నోరు తెరిచేది ఇంకో నాలుగైదు నెలల తర్వాతే కాబట్టి.