బ‌ట్ట‌లు ఊడ‌దీసినా బుద్ది రాలేదు.. చంద్ర‌బాబు పై కొడాలి నాని ఫైర్‌..!

 

Kodali Nani Comments On Chandrababu
Kodali Nani – Chandrababu

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ మంత్రి కొడాలి నాని మ‌రోసారి ఏకిపారేశాడు. మామూలుగానే చంద్ర‌బాబు అన‌గానే కొడాలి నాని ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా చంద్ర‌బాబు అండ్ బ్ర‌ద‌ర్స్ చేసిన డ్రామా పై త‌న‌దైన మాట‌ల‌తో సెటైర్స్ వేస్తూ ఎల్లో గ్యాంగ్‌ను ఉతికిప‌డేశారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని అసెంబ్లీ స‌మావేశాలు ఐదు రోజులు స‌రిపోక‌పోతే, జూమ్‌లో పెట్టుకోవాల‌ని వ్యంగాస్త్రాలు సంధించారు.

ఇక నాడు ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి, నేడు పేర్ని నానిలు కావాలనే దాడి చేయించుకున్నారని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పై స్పందిస్తూ.. అప్ప‌ట్లో అలిపిరిలో చంద్ర‌బాబు కావాల‌నే త‌న‌పై దాడి చేయించుకున్నారా అని ప్ర‌శ్నించారు. త‌మ భ‌ద్ర‌త క‌న్నా త‌మ‌కు ప్ర‌జ‌ల భ‌ద్ర‌తే ముఖ్య‌మ‌ని, పార్టీ నేత‌ల‌కు ప్ర‌జ‌లు స‌ముచిత స్థానం క‌ల్పించాల‌ని, అందుకే నిత్యం ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు నిత్యం ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటున్నారని, పేర్ని నాని పై జ‌రిగిన దాడిని ఖండించారు. ‌

రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు తినే రేషన్‌లో ప‌లు మార్పులు తెచ్చామ‌ని, ఈ క్ర‌మంలో గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా..క్వాలిటీతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామ‌న్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు మూడు వంద‌ల కోట్ల భారం పడినా, నాణ్యమైన బియ్యం ఇవ్వ‌డానికే మొగ్గుచూపామ‌ని తెలిపారు. చంద్రబాబుకు ఇలాంటి క‌నిపించ‌వ‌ని, అత‌నికి అల్జీమ‌ర్స్ జ‌బ్బుంద‌ని, అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా చంద్ర‌బాబు పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు బ‌ట్ట‌లు ఊడ‌దీసినా బుద్ది రాలేద‌ని కొడాలి నాని ఓరేంజ్‌లో ఫైర్ అయ్యారు.

నాడు రైతుల గుండెల్లో బుల్లెట్లు దింపి, అన్న‌దాత‌ల్ని కాల్చి చంపిన నీఛ‌మైన చ‌రిత్ర చంద్ర‌బాబుది అని, నేడు జ‌గ‌న్ అండ్ టీమ్ రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా ప్ర‌తి రైతుకు మేలు క‌లిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, క‌రెంటు బిల్లులు, విత్త‌నాల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు, ఇన్‌పుట్ స‌బ్సీడీలు ఇలా దాదాపు 12వేల కోట్ల రోపాయ‌లు వైసీపీ ప్ర‌భుత్వం క‌ట్టింద‌ని, అయినా వైసీపీ స‌ర్కార్ పై బుర‌ద జల్లేందుకు నిత్యం ఏదో ఒక డ్రామాతో ముందుకు వ‌స్తున్నారని బాబు పై నాని ఓ ద్వ‌జ‌మెత్తారు. మ‌రి నాని వ్యాఖ్య‌ల పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.