ఎర్రన్న వారసులెటువైపు.? తమ్ముడు అలా.! అక్క ఇలా.!

ఎర్రన్న.. అంటే, కింజరాపు ఎర్రన్నాయుడు.. అని చాలామందికి తెలిసే వుంటుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగారాయన. ఆయన వారసులిప్పుడు రాజకీయాల్లోనే వున్నారు. ఎర్రన్నాయుడు తనయుడు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోంటే, కుమార్తె అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అయితే, వచ్చే ఎన్నికల్లో ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారట. కుమార్తె భవానీ మాత్రం లోక్‌సభకు వెళ్ళాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి, ఎర్రన్నాయుడి సోదరుడు అచ్చెన్నాయుడి సంగతేంటి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

లోకేష్ ద్వారా రామ్మోహన్‌నాయుడు అసెంబ్లీ టిక్కెట్ దాదాపు ఖాయం చేసుకున్నారని సమాచారం. భవానీ రాజమండ్రి ఎంపీ సీటుకి పోటీ చేయబోతున్నారట. ఈ విషయమై అచ్చెన్నాయుడికీ.. రామ్మోహన్‌నాయుడికీ మధ్యన ‘కోల్డ్ వార్’ నడుస్తోందన్నది ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్.

కాగా, లోక్‌సభలో టీడీపీ వాయిస్‌ని రామ్మోహన్ మాత్రమే బలంగా వినిపిస్తున్నారు. గల్లా జయదేవ్, కేశినేని నాని.. టీడీపీ నుంచి లోక్‌సభకి ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఇద్దరూ ఈ మధ్య బాగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడినే లోక్ సభకు మళ్ళీ పంపాలనుకుంటున్నారట.

ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కానీ, సీట్లు తారుమారైతే మాత్రం.. టీడీపీ దెబ్బ తినడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. కింజరాపు కుటుంబం నుంచే ఇంకొకరు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారట.. అదీ అసెంబ్లీ టిక్కెట్టేనని అంటున్నారు. అదెవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.