రాష్ట్రంలో టీడీపీ ప్రస్థుతం ఎదుర్కొంటున్న రాజకీయ గడ్డుకాలం గతంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి వ్యతిరేకంగా మారారు. అలాగే ఇప్పటికే చాలా మంది పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన మూడు రాజధానులు అంశం వల్ల ఇంకొంతమంది పార్టీలు మరే అవకాశం ఉంది. ఈ మూడు రాజధానుల అంశం వల్ల ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు పార్టీ మరే ప్రోగ్రాం పెట్టుకున్నారని రాజకీయ వర్గాలుచర్చించుకుంటున్నాయి.
కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ పంచన చేరగా, చాలామంది టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యుత్సాహం కారణంగా, బీజేపీలోకి వెళ్ళే విషయమై సదరు టీడీపీ నేతలు మీనమేషాల్లెక్కెడుతున్నారట.
వైసీపీ పెడుతున్న కష్టాల నుండి బయట పడాలంటే ఒకటి వైసీపీలో చేరాలి లేదంటే వైసీపీని కూడా భయపెట్టే బీజేపీలో చేరాలి. అయితే బీజేపీలో చేరాలంటే అంతకుముందు తాము ఉన్న పార్టీ యొక్క భావజాలాన్ని పూర్తిగా వదిలివేయలని, లేదంటే బీజేపీలోకి రావడం కుదరదని సోము వీర్రాజు బహిరంగంగానే చెప్పడంతో టీడీపీ నాయకులు అందులోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకి బీజేపీ కేంద్ర పెద్దలు కూడా గాలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ రామ్మోహన్ బీజేపీలోకి వెళ్తే ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే మరోపక్క, రామ్మోహన్ నాయుడు సోదరి, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా బీజేపీ లోకి వెళతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త పడి తన పార్టీ నేతలను కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో టీడీపీ భూస్థాపితం కానుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.