అభినందన్ ఓ జాతీయ హీరో. పాక్ యుద్ద విమానాలను తిప్పికొట్టి పాక్ కు బందీగా దొరికిన వీరోచితమైన దైర్యసాహసాలు ప్రదర్శించారు. పాక్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్ కు ఢిల్లిలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే అభినందన్ కు గాయాల తీవ్రత దృష్ట్యా 4 వారాల విశ్రాంతినిచ్చారు. స్వగ్రామానికి వెళ్లాలని అధికారులు సూచించారు. అయినా అభినందన్ వెళ్లకుండా అందుకు నిరాకరించారు.
తమిళనాడులోని సొంతూరికి కాకుండా శ్రీనగర్ లో ఉన్న ఎయిర్ బేస్ కు వెళ్లి అక్కడ యుద్ధ విమానాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకెంతో ఇష్టమైన యుద్ద విమానాలు, సహచరులతో గడపడమే తనకు ఇష్టమని చాటుతున్నాడు. విశ్రాంతి పూర్తయ్యాక మరికొన్ని రోజుల్లో తదుపరి వైద్య పరీక్షలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందులో అభినంద్ ఫిట్ నెస్ సాధిస్తేనే తిరియు యుద్ద విమానాలు నడిపే అవకాశం ఉంది. అభినందన్ తీరును అంతా అభినందిస్తున్నారు.